🅿️మందుబాబులకు శుభవార్త.. తెలంగాణ‌లో అందుబాటులోకి బ‌యో లిక్క‌ర్

లిక్క‌ర్ ఇండ‌స్ట్రీలో స‌రికొత్త విప్ల‌వం బ‌యో లిక్క‌ర్‌. ఆయుర్వేద వైద్యుడు, బొటానిస్ట్ డాక్ట‌ర్ శ్రీనివాస్ అమ‌ర్ నాథ్ రూపొందించిన బ‌యో లిక్క‌ర్ ప్రొడ‌క్ట్స్ అమెరికాలో ఎప్ప‌టి నుంచో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ బ‌యో డ్రింక్స్ హైద‌రాబాద్ మార్కెట్ లో అందుబాటులోకి వ‌చ్చాయి. బంజారాహిల్స్ లోని తాజ్ డెక్క‌న్ హోట‌ల్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక‌మౌన బ‌యో విస్కీ, స్పెష‌ల్ గోల్డ్ బ‌యో విస్కీ, స్పెష‌ల్ బ్రాండీ. వైల్డ్ ఫాక్స్ విస్కీ వంటి వాటిని ప్రారంభించారు.

బ‌యోడ్రింక్స్ ఆవిష్క‌ర్త డాక్ట‌ర్ శ్రీనివాస్ అమ‌ర్ నాథ్ మాట్లాడుతూ, రెండు ద‌శాబ్దాల ప‌రిశోధ‌న ఫ‌లితం ఈ బ‌యో డ్రింక్స్ అన్నారు. సంప్ర‌దాయిక లిక్క‌ర్ల క‌న్నా ఇవి మెరుగైన‌వ‌ని ఘంటాఫ‌థంగా చెప్ప‌గ‌ల‌న‌న్నారు. సింథ‌టిక్ రుచులు, రంగులు లేకుండా, స‌హ‌జ‌మైన సుగంధంతో త‌మ ఉత్ప‌త్తులు ఉంటాయ‌ని చెప్పారు. సంప్ర‌దాయిక మ‌ద్యం ఉత్ప‌త్తులతో స‌మానంగా ఇవి కూడా ప్ర‌భావం చూపుతాయ‌న్నారు.

చీప్ లిక్క‌ర్ వంటి వాటివ‌ల్ల ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌కు లోన‌య్యే వాళ్ల‌ను త‌ర‌చుగా చూస్తూ, దానికి ప‌రిష్కారం దిశ‌గా సాగిన ఆలోచ‌న నుంచి ఈ బ‌యోడ్రింక్స్ కు అంకురార్ప‌ణ జ‌రిగింద‌ని, దీనికోసం అమెరికాతో పాటు వివిధ దేశాల్లో ఎన్నో సంవ‌త్స‌రాలు రీసెర్చ్ చేసి, విజ‌యం సాధించామ‌ని ఆయ‌న త‌న అనుభ‌వాల‌ను పంచుకొన్నారు. బ‌యో బ్రాండ్స్ అమెరికాలో ఫెడ‌ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ గుర్తింపు పొందాయి. మ‌న‌దేశంలో వివిధ రాష్ట్రాల్లో బ‌యో బివ‌రేజెస్ క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ‌లో విఎస్ఎస్‌ బివ‌రేజెస్ ద్వారా బ‌యో లిక్క‌ర్ ఉత్ప‌త్తులు ల‌భ్య‌మ‌వుతాయి.

Leave a Comment